Rapid TV - Andhra Pradesh / Anakapally : శ్రీ కన్యకా పరమేశ్వరీ అమ్మవారి ప్రతిష్ఠా శత జయంతి మహోత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న దాడి రత్నాకర్ గారు అనకాపల్లి : పట్టణంలోని శ్రీ కన్యకాపరమేశ్వరీ అమ్మవారి దేవస్థానంలో శ్రీ కన్యకా పరమేశ్వరీ అమ్మవారి ప్రతిష్ఠాపన జరిగి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరుగుతున్న శత జయంతి మహోత్సవాలలో భాగంగా శుక్రవారం విశాఖ జిల్లా తెదేపా మాజీ అధ్యక్షులు శ్రీ దాడి రత్నాకర్ గారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు రత్నాకర్ గారిని సాదరంగా ఆహ్వానించి శాలువతో ఘనంగా సత్కరించారు. అమ్మవారి తీర్ధ ప్రసాదములు అందజేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని రత్నాకర్ గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధ్యక్షులు, కార్యదర్శులు కొరుప్రోలు జగదీశ్వరరావు, బిళ్లపాటి కృష్ణకుమార్, శ్రీధరాల సోమరాజు, కడిమిశెట్టి నర్సింగరావు (సింగ్) వుప్పల రఘురాంజవహర్, నుదురుపాటి తాతాజీ, కొత్త గోపాలకృష్ణ, గ్రంధి లక్ష్మణకుమార్, తాటికొండ జీవన్, గ్రంధి రాజేష్, మాధవ్ పూసర్ల రాజా తదితరులు పాల్గొన్నారు.
Admin
Rapid TV