Rapid TV - Andhra Pradesh / Anakapally : ఎలమంచిలి రాపిడ్ టీవీ:: అనకాపల్లి జిల్లా : అచ్చుతాపురం,కనక దుర్గ లారీ ఓనర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక జరగింది. గత పాలకవర్గంలో ఉన్న కార్యదర్శి ప్రగడ ప్రకాశరావు మరియు కోశాధికారి నరమాల రమణ రాజీనామా చేయగా, నూతన అధ్యక్షులుగా అడిగర్ల దేవుడు, కార్యదర్శిగా ప్రగడ కొండలరావు, కోశాధికారిగా ప్రగడ నాగేశ్వరరావు (LIC), ఉపాధ్యక్షులుగా లాలం చిన్న సత్యం ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గం ఎలమంచిలి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రగడ నాగేశ్వరరావు ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రగడ నాగేశ్వరావు మాట్లాడుతూ నిర్వాసితులకు న్యాయం జరిగేలా అసోసియేషన్ లో ప్రతి ఒక్కరు కలిసి పనిచేయాలని, కార్మికుల మరియు పరిశ్రమ యజమాన్యాల సహకారంతో మరింత ముందుకు తీసుకువెళ్లాలని కోరారు.
Reporter
Rapid TV