Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి జిల్లా : అచ్చుతాపురం రాపిడ్ టీవీ:: ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన ఏపీ టెట్ పరీక్ష లో 150 మార్కులకు 145 మార్కులు సాధించిన కొండకర్ల నివాసి గుబ్బల విజయ కుమార్ ను ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అచ్చుతాపురం శాఖ అభినందించింది. ఈ సందర్భంగా అచ్యుతాపురం మండల శాఖ అధ్యక్షులు మద్దిల నానాజీ మాట్లాడుతూ ఏపీ టెట్లో మాదిరిగానే డీఎస్సీలో కూడా మంచి మెరిట్ సాధించి ఉద్యోగం సంపాదించి మంచి ప్రభుత్వ ఉపాధ్యాయునిగా రాణించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జి .ఎస్. ప్రకాష్, రాష్ట్ర కౌన్సిలర్ మారిశెట్టి వెంకట అప్పారావు పాల్గొన్నారు.
Reporter
Rapid TV