Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి జిల్లా: యలమంచిలి నియోజకవర్గం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 11 రోజుల దీక్ష మద్దతుగా యలమంచిలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే, వేద పండితుల దీక్ష కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న విషయంపై 3 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేపడుతున్నట్టు ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు. యలమంచిలి జనసేన పార్టీ ఆఫీసులో వేద పండితులతో సమావేశ నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు మాట్లాడుతూ లడ్డు విషయంలో జరిగిన విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేస్తున్నారని అలాగే ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ గారు కూడా ఈ దీక్ష చేపడుతున్నారని ఈ దీక్ష శాశ్వతంగా మేత పండితులు మధ్య నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలు జరిగిన తప్పుల్లో అపచారాల్లో ఘోరమైన అపచారం జరిగిందని, భక్తి ఉన్న దగ్గరే ఎలాంటి అపచారాలు జరగవని, భక్తులు లేని చోట ఇలాంటి అవతారాలు జరుగుతూ ఉంటాయని అన్నారు. రాములవారి అగ్రహారం జాన్సన్ చేయడం, ఆంజనేయ చేతులు ఖండించడం, విగ్రహాలు ధ్వంసం చేయడం, అలాగే తిరుపతిలో జరిగిన లడ్డు విషయంలో కూడా ఇలాంటి అపచారమే జరిగిందని దానికి ప్రాయశ్చిత్తం చేసుకో చేసుకోవడం కోసం నియోజకవర్గంలో ప్రజలందరూ కలిసి రావాలని ఈ దీక్షలో పాల్గొవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం అధికారులు. జనసేన టిడిపి బిజెపి నాయకులు తదిరులు పాల్గొన్నారు
Reporter
Rapid TV