Rapid TV - Andhra Pradesh / Anakapally : యలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలం లాలం కోడూరు గ్రామం లో ఉమ్మడి అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం లో పాల్గొన్న జిల్లా చైర్ పర్సన్ లాలం భవాని భాస్కర్, మాజీ జిల్లా చైర్మన్ మాట్లాడుతూ ఉమ్మడి అభ్యర్థులు ఎమ్మెల్యే అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్, ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ని అత్యధిక మెజారిటీ తో మనం గెలిపించుకోవాలని అన్నారు. లాలం కోడూరు పంచాయతీ లో నూటికి నూరు శాతం ఉమ్మడి అభ్యర్థులు కి ఓటు వెయ్యాలని కోరారు. ఆమె మాటలకు గ్రామస్తులు అందరు సంగీభావం తెలిపారు. ఈకార్యక్రమంలో జనసేన టీడీపీ నాయకులు లాలం చందు, DSN రాజు, లాలం సత్యప్రసాద్, లాలం రమేష్ నాయుడు, తాతాజీ,గ్రామ టీడీపీ అధ్యక్షులు మాకిరెడ్డి అప్పారావు, జనసేన కోర్ కమిటీ సభ్యులు శ్రీను, కట్టా కొండలరావు, కట్టా చంద్ర శేఖర్ మరియు టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొన్నారు
Reporter
Rapid TV