Rapid TV - Andhra Pradesh / Anakapally : చోడవరం/ రావికమతం రాపిడ్ న్యూస్ : అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం రావికమతం మండలం కొత్తకోట సర్కిల్ ఇన్స్పెక్టర్గా జి కోటేశ్వరరావు విధుల్లో చేరారు. ఇప్పటివరకు విశాఖపట్నం విఆర్ లో ఉన్న కోటేశ్వరరావు కొత్తకోట సర్కిల్ ఇన్స్పెక్టర్ గా చేరడంతో స్థానిక సిబ్బంది ఆయన కు స్వాగతం పలికారు. ఇప్పటి వరకూ ఇక్కడ ఎన్నికల విధుల్లో భాగంగా పనిచేసిన ఎల్.అప్పలనాయుడు విశాఖపట్నం రేంజ్ విఆర్ కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా సిఐ కోటేశ్వరరావు మాట్లాడుతూ గంజాయి నాటు సారా నియంత్రణపై దృష్టి సారిస్తామని శాంతిభద్రతలకు విగాతం కల్పించినా సంఘవిద్రోహక చర్యలకు పాల్పడినా, కఠినమైన చర్యలు ఉంటాయి అన్నారు
Admin
Rapid TV