Rapid TV - Andhra Pradesh / Anakapally : చోడవరం రాపిడ్ టీవీ:: అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం రావికమతం మండలం మరుపాక ఏపీ మోడల్ స్కూల్లో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలలో భాగంగా జిల్లా అధికారుల ఆదేశాల మేరకు విద్యార్థులచే శిక్షా సప్తాహ్ కార్యక్రమాన్ని స్థానిక ప్రిన్సిపాల్ సత్య సునీల్ నిర్వహించారు. ఈ వేడుకల్లో విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పలు ప్రదర్శన నిర్వహించారు ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఉపాధ్యాయులు ప్రిన్సిపాల్, సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి బహుమతి ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థుల్లో అంతర్గతంగా ఉండేటువంటి నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని వాళ్లలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు కూడా ఉపయుక్తంగా ఉందన్నారు.
Admin
Rapid TV