Rapid TV - Andhra Pradesh / Anakapally : RAPID TV నర్సీపట్నం : గ్రామాభివృద్ధి పనులలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని, పనులు జరిగేటప్పుడు పరిశీలించే బాధ్యత స్థానిక నాయకులదేనని ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. ఆదివారం స్పీకర్ క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులతో ఆయన సమావేశమయ్యారు. మండలాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమగ్రంగా సమాచారాన్ని వారిని అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు, స్మశానాల అభివృద్ధి, వంటి మౌలిక సదుపాయాలపై స్పష్టమైన దృష్టి పెట్టాలని సూచించారు. గ్రామ రహదారుల అభివృద్ధికి నాబార్డ్ నిధుల నుండి రూ. 12 కోట్లు విడుదల అయినట్లు ఆయన తెలిపారు. సమావేశంలో జెడ్పిటిసి సుకల రమణమ్మ, తాండవ చైర్మన్ కరక సత్యనారాయణ, నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు సర్పంచులు, మాజీ సర్పంచులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Reporter
Rapid TV