Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకావల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం రావికమతం మండలంలోని సాయిబాబా ఆలయాల్లో గురు పౌర్ణమి ని పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వేకువ ఝామునుంచే భక్తులు అధిక సంఖ్యలో ఆలయాలకు చేరుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలను నివేదిస్తున్నారు. మండలంలోని తట్టబంద సాయిబాబా ఆలయంలో సర్పంచ్ గోకివాడ చిన్న రమణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం భారీ అన్న సమరాధన కార్యక్రమం నిర్వహించారు. కొత్తకోట ఆలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో పి ఏ సీఎస్ అధ్యక్షులు గుమ్మడి సత్యదేవ్, గున్నాజీ, సర్పంచ్,లోవరాజు ఉప సర్పంచ్, దేవా,వెల్లంకి శ్రీనివాస్, అడ్వకేట్ రాజాన సత్యప్రసాద్, కేదర్శెట్టి సర్వేశ్వరరావు కుటుంబీకులు గ్రామ పెద్దలు తదితరులు హాజరయ్యారు
Admin
Rapid TV