Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి జిల్లా : యలమంచిలి నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ యు. వి రమణమూర్తి రాజు (కన్నబాబు) నామినేషన్ దాఖలు చేయడమైనది. ఈ కార్యక్రమంలో ముందుగా ఎటికోప్పాక బండిమాంబ అమ్మవారిని దర్శించుకుని అక్కడ నుండి నేరుగా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. నియోజకవర్గ నాలుగు మండలాల నుండి వేల సంఖ్యలో విచ్చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు ప్రజలతో కలసి యాత్రగా ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లి నామినేషన్ వేశారు, ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా ఎంపీ అభ్యర్థి శ్రీ బూడి ముత్యాల నాయుడు, ఎంపీ బీసెట్టి సత్యవతి, అనకాపల్లి జిల్లా పార్టీ ప్రెసిడెంట్ మరియు గవర కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బొడ్డేటి ప్రసాద్,పరిశీలకులు రొంగలి జగన్నాథం మాజీ డిసిసిబి చైర్మన్ యు. సుకుమార్ వర్మ (తేజ) పాల్గొన్నారు. నామినేషన్ అనంతరం దిమిలీ రోడ్డు జంక్షన్ నందు భారీ బహిరంగ సభ నిర్వహించడం జరిగింది.
Reporter
Rapid TV