Sunday, 26 July 2026 03:28:33 AM
# సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక

యండపల్లి వలస ప్రధాన రహదారిలో నెలకొన్న సమస్య పరిష్కారానికి చర్యలు

Date : 30 July 2024 07:51 PM Views : 247

Rapid TV - Andhra Pradesh / అల్లురిసితరమరజు : చెత్తాచెదారాలు తొలగింపు, డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభం అరకులోయ మండలం యండపల్లివలస గ్రామంలోని గంగమ్మ తల్లి గుడి ఎదురుగా ప్రధాన రహదారిలో వర్షం నీరు నిల్వ ఉండిపోవడంతో పాదచారులు, వాహనదారులు ఇబ్బందులు కు గురవుతున్నారు. గత కొద్దిరోజులుగా ఏజెన్సీలో వర్షాలు విస్తారంగా కురుస్తుండడంతో ఈ సమస్య మరింత రెట్టింపు అయింది. దీంతో ప్రజల విన్నపం మేరకు స్పందించిన అధికారులు సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా మంగళవారం స్థానిక ఎంపీడీవో వెంకటేష్ ఆధ్వర్యంలో పద్మాపురం పంచాయతీ కార్యదర్శి రాంబాబు, రోడ్లు భవనాల శాఖ తరపున రుబీన్ ప్రధాన రహదారిలో నెలకొన్న సమస్య ప్రాంతానికి వెళ్లి పరిష్కారానికి చర్యలు మొదలుపెట్టారు. ప్రధాన రహదారి లో వర్షం నీరు నిలవ ఉండిపోయిన ప్రాంతం వద్ద పేరుకుపోయిన చెత్తాచెదారాలను తొలగించి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేశారు. అలాగే వర్షపు నీరు నిల్వ ఉండకుండా రహదారి పక్కన డ్రైనేజీ నిర్మాణ పనులకు చర్యలు చేపట్టారు. గత కొద్ది నెలలుగా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న ఈ సమస్య పరిష్కారానికి ఎంపీడీవో వెంకటేష్ స్పందించడంతో ఎండపల్లివలస గ్రామస్తులు, వాహన చాతకులు , పాలచారులు ఆనందం చేశారు. కాగా ఇదే సమస్యపై మానవ హక్కుల నేర నిరోధక సంఘం విశాఖ ఉమ్మడి జిల్లాల అధ్యక్షురాలు కె కృష్ణకుమారి సమస్యను పరిష్కరించమని గతంలో అధికారులను కోరారు. ఈ సందర్భంగా ఎంపీడీవో వెంకటేష్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించడమే తమ లక్ష్యమని చెప్పారు. గిరిజన ప్రాంతంలో సేవ చేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

HARI ARAKU

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: