Rapid TV - Andhra Pradesh / అల్లురిసితరమరజు : పద్మాపురంలో సర్పంచ్ పెట్టలి సుస్మిత చేతుల మీదగా ఇళ్ళ పట్టాలు పంపిణీ అరకులోయ మండలంలోని పద్మాపురం మేజర్ పంచాయతీలో శుక్రవారం ఆ పంచాయతీ సర్పంచ్ పెట్టేలి సుష్మిత ఆధ్వర్యంలో నవరత్నాలు - ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. దీనిలో భాగంగా పంచాయతీ పరిధిలోని 110 లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ సుష్మిత మాట్లాడుతూ వైసిపి పాలనలో సంక్షేమ పథకాలన్నీ అమలైనట్లు తెలిపారు. పేదలకు సొంతింటి కళ నెరవేర్చడమే ఈ పథకం లక్ష్యమన్నారు. కాగా రెండో విడతలో మరి కొంతమంది అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలని పంపిణీ చేయడం జరుగుతుందని సర్పంచ్ తెలిపారు . ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటేష్, వార్డు సభ్యులు షేక్ యాసీన్ , కొండలరావు , సచివాలయం కన్వీనర్ జన్ని అర్జున్, వీఆర్వో వెంకటేష్ , నాయకులు రాజ్ కుమార్ , జగత్ రై, మహేష్, సుక్ర, సెక్రటరీ రాంబాబు, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Reporter
Rapid TV