Rapid TV - Andhra Pradesh / Anakapally : విద్యార్థులకు విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు వెంటనే చెల్లించాలి - ఎస్ఎఫ్ఐ యలమంచిలి, న్యూస్ : ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో యలమంచిలి ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని కాలేజీల నుండి విద్యార్థులు స్వచ్ఛందంగా కాలేజీలను బహిష్కరించి పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగిందని అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు ఎం బాలాజీ అన్నారు. ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు ఎం బాలాజీ, డివిజన్ సెక్రెటరీ కె మణికంఠ, డివిజన్ ప్రెసిడెంట్ కే కేశవ లు మాట్లాడుతూ విద్యార్థులకు ఇవ్వవలసిన విద్యా దీవెన, వసతి దీవెన అమ్మబడి ఇంకా బకాయిలు పెండింగ్ ఉండడం వల్ల విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని కాలేజీల్లో విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. అదేవిధంగా కాలేజీలో ఎగ్జామ్ ఫీస్ కట్టేందుకు విద్యార్థులు వెళితే కాలేజీ ఫీజు చెల్లిస్తే తప్ప మేము కట్టించుకోమని యాజమాన్యం అంటుందని వీటిపైన ప్రభుత్వ వెంటనే స్పందించి వెంటనే బకాయిలు చెల్లించాలని ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్ లో ఉన్న బకాయిలు విడుదల చేయకపోతే మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు శరణ్య, జాహ్నవి, సంధ్య, రత్నం, భవాని, రవి, రాము, లక్ష్మణ్, బాలు, గని, దాసు, కృపానంద, మహేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
Rapid TV