Rapid TV - Andhra Pradesh / Anakapally : దాడి వీరభద్రరావు గారిని కలిసిన వెంకుపాలెం గ్రామ నాయకులు, కార్యకర్తలు... అనకాపల్లి, జనవరి 27: అనకాపల్లి నియోజకవర్గం అనకాపల్లి మండలం వెంకుపాలెం గ్రామానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు మాజీ మంత్రి శ్రీ దాడి వీరభద్రరావు గారిని శనివారం స్థానిక రింగురోడ్డు లక్ష్మీనారాయణనగర్‌లో గల డీవీఆర్ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసారు. అనంతరం దాడి వీరభద్రరావు గారికి పుష్పగుఛ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వీరంతా పలు అంశాలపై, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కొంతసేపు చర్చించారు. అలాగే తనను కలిసేందుకు విచ్చేసిన ఆయా గ్రామాలకు చెందిన నాయకులను, కార్యకర్తలను దాడి వీరభద్రరావు, దాడి రత్నాకర్ అప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
Admin
Rapid TV