Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ న్యూస్ రావికమతం : 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం లో భాగంగా రావికమతం తాసిల్దార్ వెంకటరమణ ఆధ్వర్యంలో శనివారం ఉదయం భారీ ర్యాలీ మనవహార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులతోనూ అధికారులతో కలిసి రావికమతం తాసిల్దార్ కార్యాలయం నుంచి బి.యన్ రోడ్డు మీదుగా కాంప్లెక్స్ మరియు గ్రామ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాలుగు రోడ్లు కూడలిలో మానవహారం గా ఏర్పడి జాతీయ ఓటర్ల దినోత్సవం ప్రాముఖ్యం గురించి తెలిపారు అనంతరం తాసిల్దార్ వెంకటరమణ మాట్లాడుతూ జాతీయ హోటల్ దినోత్సవ కార్యక్రమం మనందరికీ ఎంతో ముఖ్యమైన పండగ లాంటిదని ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకొని దేశ భద్రత దేశ సమగ్రతను కాపాడేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ నాయుడు సీనియర్ అసిస్టెంట్ విఆర్వోలు మూర్తి నాగరాజు జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Admin
Rapid TV