Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి జిల్లా పాయకరావు పేట : స్థానిక ఎమ్మెల్యే వంగలపూడి అనిత హోమ్ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత శనివారం మొదటిసారిగా పాయకరావుపేట విచ్చేస్తున్న సందర్భంగా స్థానిక నాయకులు ఘన స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేశారు. నేడు శనివారం మధ్యాహ్నం పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలోని హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత విజయోత్సవ ర్యాలి జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ముందుగా పాయకరావుపేట మండలంలోని పాండు రంగ స్వామివారి దర్శనానికి వెళ్తారు. అక్కడ నుండి ఎస్.రాయవరం మండలం పెనుగొల్లు ధర్మవరం నుండి అడ్డురోడ్డు మీదుగా నక్కపల్లి మండలం ఉపమాక చేరుకుంటారు. ఉపమాక లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు. అక్కడ నుండి నక్కపల్లి మండలం సారిపల్లి పాలెం గ్రామ సమీపంలో క్రిష్ టౌన్ షిప్ లో ఉన్న అనిత స్వగృహం కు చేరుకుంటారు. అక్కడ నాయకులు, కార్యకర్తల తో ఆత్మీయ సమావేశంలో పాల్గొంటారు.
Reporter
Rapid TV