Sunday, 26 July 2026 03:54:43 AM
# సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక

నూకాలమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి కొల్లు రవీంద్ర

Date : 29 March 2025 06:59 PM Views : 267

Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టీవీ అనకాపల్లి.. పదికోట్ల రూపాయలతో శ్రీ నూకాంబిక అమ్మ వారి ఆలయ నిర్మాణం, అభివృద్ది పనులు చేస్తున్నామని జిల్లా ఇంచార్జి మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మ వారి వార్షిక జాతర మహోత్సవాలు ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర గనులు, భూగర్బ, ఎక్సైజ్ శాఖ మంత్రి మరియు జిల్లా ఇంచార్జి మంత్రి కొల్లు రవీంద్ర రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం పత్రికా విలేఖరులతో మాట్లాడుతూ శ్రీ నూకాంబిక అమ్మ వారి వార్షిక జాతర మహోత్సవాలు పార్లమెంటు సభ్యులు సి.ఎం.రమేష్, శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ కృషి ఫలితంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర పండుగగా ప్రకటించడం ఆనందదాయకమని తెలిపారు. రాష్ట్ర పండుగగా ప్రకటించిన తరువాత తొలిసారిగా నిర్వహిస్తున్న వార్షిక జాతర మహోత్సవాలకు అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించడం తన అదృష్టమన్నారు. దేవాలయాన్ని సుమారు పదికోట్ల రూపాయలు నిధులతో నిర్మాణం, అభివృద్ది చేస్తున్నట్లు తెలిపారు. దేవాలయ నిర్మాణం, అభివృద్ది పనులు పూర్తయిన తరువాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుందన్నారు. దేవాలయం అభివృద్ది పనులు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు మూలంగా భవిష్యత్తులో ఎక్కువ మంది భక్తులు వస్తారని, అనకాపల్లి పర్యాటకంగా కూడా అభివృద్ది చెందుతుందని తెలియజేసారు. దేవాలయం అభివృద్దికి ప్రభుత్వం తరపు నుండి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్, శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ, పంచకర్ల రమేష్ బాబు, అర్బన్ పైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు కార్పొరేషను చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, దాడి రత్నాకర్, మల్ల సురేంద్ర, పి.వి.జి. కుమార్, ఆలయ చైర్మన్ పీలా నాగశీను, పాల్గొన్నారు.

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: