Rapid TV - Andhra Pradesh / Vishakhapatnam : శ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామి దేవస్థానం సింహాచలం లో స్వామివారి సహస్రనామార్చన నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా శుక్రవారం ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపం లో అధిష్టింపజేశారు. పాల్గొన్న భక్తుల, గోత్రనామా లతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమశాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళాశాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు.
Reporter
Rapid TV