Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టీవీ, యలమంచిలి: అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం సర్వసిద్ది ఎస్.సి కాలనీకి చెందిన కసిపా చినతల్లి ని అంబేద్కర్ యువజన సేవా సంఘం అధ్యక్షుడు ఎమ్ రమణారావు పరామర్శించి సంఘం తరపున 10700/- రూ అందించారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ జి.రమేష్ ,వైస్ ప్రెసిడెంట్ శ్రీను,ఎస్.శ్రీను, వై.చిలుకు, ఎమ్.అప్పారావు, బి.నాగరాజు, పి.అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు రమణారావు ఎవరికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా ఈ సంఘం ముందుంటుందని అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని యూత్ సభ్యులు కి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు.
Reporter
Rapid TV