Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టివి రావికమతం : మండలంలోని మేడివాడ పంచాయతీ శివారు అప్పలంపాలం గ్రామ సరిహద్దులోని జీడి తోటలో నాటు సారా తయారు చేస్తున్నారనేటువంటి ముందస్తు సమాచారం మేరకు ఎస్బి సిబ్బందితో కలిసి రావికమతం పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నాటు సారా గ్యాస్ స్టవ్ పై వండుతున్న మేడివాడ గ్రామానికి చెందిన గెడే రమణ, గేడే చిన్నాలు అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని రావికమతం పోలీస్ స్టేషన్ కి తరలించారు వారి వద్ద నుంచి 40 లీటర్ల నాటుసార 3వేల లీటర్ల బెల్లం పులుపులను స్వాధీన పరుచుకొని సారా తాయారికి ఉపయోగించే వస్తువులను అక్కడే ధ్వసం చేశారు.
Admin
Rapid TV