Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టీవీ నర్సీపట్నం : అమరావతి రాజధాని పనుల పునః ప్రారంభం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విచ్చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఘన స్వాగతం పలికారు. గన్నవరం విమానాశ్రయంలో ప్రధానిని వ్యక్తిగతంగా కలిసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి స్పీకర్ అయ్యన్నపాత్రుడు ను "అధ్యక్షా" అంటూ ఆప్యాయంగా పలకరించారు. రాజధాని అమరావతి పునః ప్రారంభానికి విచ్చేసిన ప్రధానికి స్పీకర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Reporter
Rapid TV