Rapid TV - Andhra Pradesh / Anakapally : శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ప్రతిష్ఠా శతజయంతి మహోత్సవాలలో భాగంగా అనకాపల్లి శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థాన సంఘం ఆధ్వర్యంలో దేవాలయం వెనుక ప్రాంగణంలో 29 జూలై సోమవారం సాయంత్రం 6 గంటలకు పద్మశ్రీ పురస్కార గ్రహీత, మహా సహస్రావధాని *శ్రీ గరికిపాటి నరసింహారావు* గారిచే *"శ్రీ మాత్రే నమః"* అనే అంశం మీద ప్రవచనం జరుగుతుందని ప్రతిష్ఠా శతజయంతి ఉత్సవముల చైర్మన్ కోరుకొండ బుచ్చిరాజు, కో చైర్మన్ డా. గ్రంధి శేషు కుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే అని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు బిళ్ళపాటి కృష్ణకుమార్, కార్యదర్శి కొరుపోలు జగదీశ్వర్ రావు, కోశాధికారి శ్రీధరాల సోమరాజు, ఉపాధ్యక్షులు రవిరాం జవహర్, సహ కార్యదర్శి మాణిక్యం, ఉత్సవ కమిటీ చైర్మన్ ఉప్పల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు
Admin
Rapid TV