Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టివి: అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం రావికమతం మండలం లో నూర్పుడు మిషన్ బోల్తా పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.మాడుగుల మండలం ఒమ్మలి గ్రామానికి చెందిన వరి నూర్పుడు యంత్రం, మాకవారిపాలెం మండలం తామర గ్రామం వెళ్లి వరి కుప్పలను యత్రం తో నూర్చి. పని ముగిసిన తరువాత తట్టబంధ, రావికమతం మండలం మీదుగా ఒమ్మలి గ్రామం తిరిగి వెళుతుండగా. రావికమతం గ్రామం నాలుగు రోడ్ల కూడలి వద్ద మలుపు తిరుగు తుండగా బోల్తా పడిందిఆ సమయంలో మిషన్ తో పాటూ ఉన్న ఇద్దరు వ్యక్తుల పై మిషన్ పడి అక్కడి కక్కడే మృతి సంఘటన తెలుసుకున్న రావికమతం పోలీసులు అక్కడకు చేరుకొని డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు జెసిబి సహాయంతో మిషన్ ని అక్కడ నుంచి బయటికి తీశారు మిషన్ కింద ఉన్న రెండు మృత దేహాలను బయటకు తీశారు మృతులు జొన్నపల్లి నాయుడు, జొన్నపల్లి గణేష్ లుగా పోలీసులు గుర్తించారు గాయపడిన మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు, పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు
Admin
Rapid TV