Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి రాపిడ్ టీవీ: భారతదేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత ఒక్క కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఐ.ఆర్. గంగాధర్ అన్నారు. బుధవారం అనకాపల్లి లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారి 54వ జన్మదిన కార్యక్రమం ఘనంగా జరిగింది .ముందుగా జన్మదిన కేకును గంగాధర్ కట్ చేసి సభ్యులకు పంపిణీ చేశారు .ఈ సందర్భంగా గంగాధర్ మాట్లాడుతూ దేశానికి కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ అని గంగాధర్ తన ఆశ భావాన్ని వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని తన భుజాలపై వేసుకొని గల్లీ నుండి ఢిల్లీ వరకు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి కార్యకర్తలలో నూతన ఉత్సాహాన్ని పెంపొందించారని గంగాధరన్నారు. రాహుల్ గాంధీ పాదయాత్ర దేశ ప్రజలను, ప్రజాస్వామికవాదులను, హక్కుల సంఘాలను ,దళిత, గిరిజన ,బీసీ, మైనార్టీలకు ఆశా దీపంగా కనిపించిందని గంగాధరన్నారు. కేంద్రంలో మోడీ, అమిత్ షా, ఆర్ఎస్ఎస్ ఎంత కుటిల ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్ పార్టీ గెలుపును ఆపలేకపోయారని గంగాధరన్నారు .మతం పేరుతో రాజకీయాలను శాశ్వతం చేసుకోవాలని బిజెపి కలలు కన్నారని కానీ దేశ ప్రజలు వారు ప్రయత్నాలను తిరస్కరించాలని అన్నారు.బిజెపికి దేశ ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పారని గంగాధర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ దేశానికి దిశా ,నిర్దేశం చేయగలదని గంగాధర్ అన్నారు. దేశం కోసం, దేశ భవిష్యత్తు కోసం రాహుల్ చేస్తున్న పోరాటంలో సైనికులు వలె పని చేస్తామని సమావేశంలో పాల్గొన్న సభ్యులందరూ ప్రమాణం చేశారు.ఈ సమావేశంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిల్లా కోటేశ్వరరావు ,అనకాపల్లి పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దాసరి సంతోష్, దాడి పరమేశ్వరరావు, యూత్ కాంగ్రెస్ నాయకులు కొల్లి సత్యారావు, కర్రి దుర్గాప్రసాద్, అల్లుమల్ల భాస్కర్, మహిళా కాంగ్రెస్ నాయకులు ఇందుర్తి గౌరీ, ఏడువకుల దేవుడమ్మ ,ఎరుకల హక్కుల పోరాట సంఘం కన్వీనర్ పూజారి నర్సయ్య, మొదలవారు పాల్గొన్నారు.
Admin
Rapid TV