Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి: ఉత్తరాంధ్ర ఇలవేల్పు, ప్రముఖ ఆరాధ్య దైవం అనకాపల్లి జిల్లా, అనకాపల్లి పట్టణంలో వేంచేసియున్న శ్రీశ్రీశ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో తే 28-07-2024 ది ఆషాడ మాసం నాలుగవ ఆదివారము దేవాలయ ప్రాంగణం బాలాలయంలో యున్న శ్రీ అమ్మవారికి భక్తుల సహాయ సహాకారములతో శాఖాంబరి అలంకరణ చేయుట నిర్ణయించడం అయినది. శ్రీ అమ్మవారి ఉత్సవ మూర్తికి శాఖాంబరి అలంకరణ నిమిత్తం అవసరమగు కూరగాయలు ఇచ్చే భక్తులు వారు దేవస్థానం కార్యాలయంలో ఇచ్చి తగు రశీదును పొంది అమ్మవారి శుభాశీస్సులు పొందవలసినదిగా ఆలయ సహాయ కమీషనరు & కార్యనిర్వహణాధికారి బండారు ప్రసాద్ తెలియజేశారు.
Reporter
Rapid TV