Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టీవీ అనకాపల్లి: బాధ్యతల చేపట్టిన తర్వాత తొలిసారి ఉమ్మడి విశాఖ జిల్లాకు వచ్చిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు విశాఖపట్టణం విమానాశ్రయంలో ఆత్మీయ స్వాగతం అనకాపల్లి, జూన్ 29: స్పీకర్ గా ఎన్నికైన తర్వాత మొదటిసారిగా ఉమ్మడి విశాఖ జిల్లాకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడునకు విశాఖ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి పటాన్ శెట్టి, జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ ఆయనకు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు స్పీకర్ పదవి ద్వారా అత్యున్నత గౌరవం ఇచ్చి ప్రధాన బాధ్యతలు అప్పగించినందుకు సీఎం చంద్రబాబుకు చింతకాయల అయ్యన్నపాత్రుడు కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యమంత్రి నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, పరిమితులకు లోబడి హుందాగా పని చేస్తానని అన్నారు.
Admin
Rapid TV