Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి జిల్లా, మారేడుపూడి గ్రామానికి చెందిన కోరుకొండ అరుణ జూన్ 10 నుండి 13 వరకు కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఖేలో ఇండియా ఉమెన్స్ వూషూ లీగ్ ( మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ) సీనియర్ కేటగిరి 70కేజీ కాంపిటేషన్ లో గోల్డ్ మెడల్ సాధించిoది. అనకాపల్లి జిల్లా బాక్సింగ్ సంఘం అధ్యక్షులు మళ్ళ సురేంద్ర వారి స్వగృహంలో కోరుకొండ అరుణని అభినందించి సత్కరించారు. ఈ సందర్భంగా మళ్ళ సురేంద్ర మాట్లాడుతూ బాక్సింగ్ రంగంలో అనకాపల్లి జిల్లాకు మంచి పేరు తీసుకొస్తున్నందుకు,ఆమెను అభినందించానని అన్నారు. భవిష్యత్ లో అంతర్జాతీయ స్థాయిలో బాక్సింగ్ రంగంలో అనకాపల్లికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొచ్ ఆర్ వెంకటేష్, దువ్వాడ హరీష్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Rapid TV