Rapid TV - Andhra Pradesh / Anakapally : ముంపుకు గురైన పొలాలను సందర్శించిన ప్రగడ నాగేశ్వరావు యలమంచిలి, న్యూస్ : మున్సిపాలిటీ పరిధిలో రామారాయుడుపాలెం 24వార్డులో సోమవారం సింహాద్రి అప్పన్న కాలనీ అకాల వర్షాలు కారంగా ముంపుకు గురైన పొలాలను తెలుగుదేశం పార్టీ యలమంచిలి నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రగడ నాగేశ్వరరావు సందర్శించారు. ఈ సందర్భంగా ప్రగడ నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతులు ఈ వర్షాల పట్ల అప్రమత్తతో వ్యవహరించాలని, అధికారులు ఈ సమయంలో అందుబాటులో ఉండాలని అన్నారు, ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు కొటారు సాంబ, పట్టణ ఉపాధ్యక్షులు గొర్లి బాబురావు, కర్రి స్వామి తదితరులు పాల్గొన్నారు.
Reporter
Rapid TV